ప్రలోభాలకు గురి చేసేలా మేనిపేస్టోలు

– ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చి
– ప్రజల సొమ్ము పార్టీలు దానం
– ప్రభుత్వాలు చేసిన అప్పుడు ప్రజలపై
– అధికారం ఇస్తే స్వంత ఇంటి నుండి ఇచ్చినట్లు బిల్డపులు…
– సాధ్యసాద్యాలుపై దష్టి సారించాలి
– విద్య, వైద్యం ఉపాధి కోసం అవకాశాలు కల్పించాలి
రేవు దాటే వరకు ఓడ మల్లయ్య ఆ తర్వాత బోడి మల్లయ్య అన్న చందంగా రాజకీయ పార్టీలు వివరిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని విస్మరిస్తున్న పాలకులు ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు అనేక వాగ్దానాలు చేశాయి. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ నిరుద్యోగులకు బతి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ప్పుడు ఇస్తున్న రాజకీయ నాయకుల హామీలు చూస్తుంటే… గతం గుర్తుకొస్తుందని ఓటర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాబోయే ఎన్నికలను దష్టిలో ఉంచుకొని అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఈ మేనిఫెస్టోలోని అంశాలన్నీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటట్లు ఉన్నాయని మేధావి వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ఉచిత హామీలు పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలపై నియంత్రణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. ఇచ్చిన హామీలను అమలు జరిగేలా చూసే ఒక విధానం లేకపోవడం పట్ల రాజకీయ పార్టీలు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌ దష్టి సారించి ప్రలోభాలకు గురి చేసే అంశాలను పరిగలోనికి తీసుకొని చర్యలు తీసుకోవాలని విద్యావంతులు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పథకాలు ఇతర హామీలు సాధ్యాసాధ్యులపై పార్టీలు పరిగణలోనికి తీసుకొని పార్టీ లు హామీలు ఇవ్వాలని ప్రజలు అంటున్నారు. ఒకసారి రాజకీయ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇస్తే ఖచ్చితంగా అమలయ్యేలా ఒక వ్యవస్థ ఉండాలి. అప్పుడే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.ఉచిత హామీల ప్రభావం ఓటర్ల పై పడి గెలుపోటములపై ప్రభావం చూపుతాయి. రాజకీయాల్లో ఉచిత హామీలు మంచివే అయినా అవి అమలు జరగాల్సిన పరిస్థితి లేదు. .పథకాలు అంటే ఆర్థిక తోడ్పాటు కల్పించేది ఉండాలి కానీ వారికి ఉపాధి కల్పించేలా ఉండాలి.సమాజంలో యువత సన్మార్గంలో నడవాలంటే వారికి నాణ్యమైన విద్య, నల్‌ వైద్యం ,ఉపాధి అవకాశాలు కల్పిస్తే మిగతా ఉపాధి అవకాశాలు అంతగా అవసరం లేదు. పాలకులు చేపట్టిన విధానాల వల్ల దేశాభివద్ధి లో పురోగతి సాధిస్తుందని అప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లాలో నేడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిత్యవసర సరుకులు ఆకాశాన్ని అంటాయి .రాష్ట్రాన్ని లూటీ చేసేందుకు అప్పులు చేయడమే రాజకీయ నాయకుల లక్ష్యం అంటూ విమర్శలు ఎక్కువవుతున్నాయి. రాజకీ యంలో అధికారం కోసం తహతహలాడే రాజకీయ పార్టీల నాయకులు ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టి హామీలను కురిపించి తరువాత చేతులెత్తేయడం వారికి పరిపాటిగా మారింది.గారడి మాటలకు ప్రజలు మోసపోవద్దని ప్రతి విషయాన్ని గమనించి మేలుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఇచ్చే పథకాలు రాజకీయ నాయకుల ఇంటి నుండి ఇచ్చేవి కావని తెలిపారు. నిత్యవసర సరుకులు ప్రజలు కొనుగోలు చేయడం వల్ల దానిపై ప్రభుత్వం విధించిన పన్ను చెల్లించిన డబ్బు ఖజానాలో జామా అయిన తరువాత వాటి నుంచే పథకాల పేరిట పంపిణీ చేస్తారు .కానీ రాజకీయ నాయకుల ఇంటి నుండి ఇచ్చేవి కావన్నారు.ఇది గమనించని నాయకులు సొంత ఇంటి నుండి ఇస్తున్నామని బిల్డప్‌ ఇస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.కాని రాజకీయ నాయకులు ప్రజల డబ్బుతో జల్సాలు చేస్తూ ప్రజలపై పెద్దరికం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టే మేనిఫెస్టోలను కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణ చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మేధావి వర్గం సూచిస్తుంది.

Spread the love