మణిపూర్ దోషులను కఠినంగా శిక్షించాలి : ఆదివాసీ ఉద్యోగుల సంఘం

నవతెలంగాణ -మంగపేట
మణిపూర్ గిరిజన మహిళలపై దాడి చేసి హతమార్చిన దోషులను కఠినంగా శిక్షించాలని ఆదివాసి ఉద్యోగుల సంఘం మండల గౌరవ అధ్యక్షుడుతల్లడి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని  బ్రాహ్మణపల్లిలో జరిగిన ఆదివాసి ఉద్యోగుల సంఘం సమావేశంలో తల్లడి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. మణిపూర్ లో కుకీ తెగకు చెందిన గిరిజనలు, మైతి బ్రాహ్మణులకు మధ్య గత 80 రోజులుగా ఘర్షణలు జరుగుతుంటే మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి ఘటనల వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ద్రుష్టి సారించి మైతి బ్రాహ్మణులను ఎస్టీ జాబితాలో కలపకుండా రాష్ట్రం రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసి సంఘాల నాయకులు గొప్ప సమ్మరావు, కొండ చెంచయ్య, పోడెం సమ్మయ్య, మోడెం హనుమంతరావు, ఇర్ప మోహన్ రావులు పాల్గొన్నారు.

Spread the love