మండలంలో ఘనంగా మే డే సంబరాలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు,పివైఎల్ అద్వర్యంలో బుధవారం 138 మేడే సందర్భంగా మండలం లోని ఘనపూర్, నడపల్లి, మెంట్రాజ్ పల్లి గ్రామపంచాయతిల ముందు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పివైఎల్  జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, సిపిఐ ఎంఎల్ జిల్లా కమిటీ సభ్యులు జెపి గంగాధర్ మాట్లాడుతు గతంలో కార్మికులకు 14 పని గంటలు ఉండేదని, పని గంటలు తగ్గించాలని 1886లో అమెరికాలోని  చికాగో కేంద్రంగా కార్మికవర్గం 8 గంటల పని దినాన్ని కోరుతూ పరిశ్రమిక యాజమాన్యలకు వ్యతిరేకంగా సమ్మెకు దిగి అరెస్ట్ లు, కాల్పులు, కేసులు, నిర్భంధం ఉరిశిక్షలు వరుసగా జరిగాయని అన్నారు. వారి త్యాగాల వల్ల కార్మికవర్గం 8 గంటల పని దినాన్ని సాధించుకుందన్నారు. నాటి నుండి ప్రపంచం కార్మిక వర్గం మే 1ని శ్రామిక వర్గ పోరాట దినం (మేడే) గా పాటిస్తుందని వివరించారు. కార్మిక హక్కుల కోసం పోరాడి అమరులైన చికాగో కార్మికులకు  విప్లవ నివాలూల్ని అర్పిస్తుందని అన్నారు. అప్పుడు సాధించుకున్న 8 గంటల పనిధానాలను కాలేరాసే విధంగా బిజెపి ప్రభుత్వం 4 కొడ్ లను తీసుకవస్తుందన్నారు. సుప్రీం కోర్టు పనికి తగిన వేతనం అని చెప్పిన ఈ కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదన్నారు. అంతే కాదు ఈ రోజు గ్రామపంచాయతి సిబందికి పిఎఫ్, కార్మికులు చనిపోతే వారికీ భీమా సౌకర్యం లేదన్నారు. ఈరోజు దేశం పరిశుభ్రంగా ఉందంటే దానికి మూలం గ్రామపంచాయతి కార్మికుల శ్రమ దిగి ఉందన్నారు. మత రాజకీయాలు చేస్తున్న బిజెపి ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఇండియా కూటమి అభ్యర్థులను బలపరచాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో దేవస్వామి,భారతి, పంచాయతీ కార్మికులు సాయిలు, రాజు, రవి, శేఖర్ శ్రీనివాస్, రాము, సంతోష్, బాబు తదితరులు పాల్గొన్నారు.
Spread the love