Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి గ్రామంలో మేడే ఉత్సవాల నిర్వహించాలి

ప్రతి గ్రామంలో మేడే ఉత్సవాల నిర్వహించాలి

- Advertisement -

సీఐటీయు జిల్లా కార్యదర్శి ఎండి సలీమ్ 
నవతెలంగాణ – కట్టంగూర్
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను ప్రతి గ్రామంలో అన్ని రంగాల కార్మికులు ఘనంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.కార్మిక హక్కుల కోసం రక్తం చిందించి ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాల గుర్తుగా మే డే ను నిర్వహించుకుంటున్నామని అన్ని రంగాలలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

నాటి ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్నచట్టాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పొన్న అంజయ్య , సిఐటియు మండల కమిటీ సభ్యులు పొడిచేటి లింగయ్య, జి వెంకటయ్య, ఊట్కూరు కృష్ణ, సైదులు  రెడ్డిపల్లి నాగరాజు, అబ్బగోని సంతోష, నూనె శోభ రాణి, జి వెంకటయ్య ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -