
నవతెలంగాణ – వేములవాడ
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. బుధవారం స్థానిక అమరవీరుల స్థూపం నుండి ర్యాలీగా వచ్చి స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం అశోక్ జెండా ఎగురవేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో, తిప్పాపూర్ చౌరస్తాలో జెండాలు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, సీపీఐ( ఎం) నాయకులు ముక్తికాంతం అశోక్, స్థానిక కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పులి రాంబాబు గౌడ్, పీర్ మహమ్మద్, అన్నవరం శ్రీనివాసు, కెయుబిఎస్ నాయకులు ఎర్రబెల్లి నాగరాజు, యూనియన్ వేములవాడ పట్టణ అధ్యక్షులు బట్టు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు దోమల లచ్చయ్య, సుంకపాక, పరిశ్రమలు ప్రధాన కార్యదర్శి పందుల మల్లేశం, నాయకులు సావనపల్లి శ్రీనివాస్, పెంట శంకర్, ఎండి అర్జున్, రాచకొండ శ్రీనివాస్, వావిలాల లక్ష్మి, వావిలాల రాధా, మమత, పెంటగట్టవ పెంట రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.