మేడారం పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి..

– ఐటీడీఏ పీఓ అంకిత్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ
– జిల్లా ఉన్నత అధికారులతో మేడారం జాతర పై సమీక్ష సమావేశం.
– జాతర నిర్వహణ ను ఎనిమిది జోన్లు, 42 సెక్టార్లు గా విభజన
– భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి
నవతెలంగాణ-తాడ్వాయి : మేడారం పనులు నాణ్యతగా సకాలంలో, పకడ్బందీగా పూర్తి చేయాలని ఐ టి డి ఎ పి ఓ  అంకిత్, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీజ లు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేడారం లో సమ్మక్క భవనం లో జిల్లా ఎస్పీ శబరీష్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ అంకిత్ మాట్లాడుతూ  ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర పనులు సకాలంలో నాణ్యతగా పూర్తి చేయాలన్నారు. జాతర నిర్వహణలో మేడారం ప్రాంతాన్ని మొత్తం ఎనిమిది జోన్లుగా, 42 సెక్టార్లుగా విభజించామని వాటికి సంబంధించిన అధికారులను సైతం నియమించామని అన్నారు. జాతర సమయం దగ్గర పడుతున్నా  నేపథ్యంలో  అధికారులు పనులను జనవరి చివరి వారం లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర జరిగే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ములుగు జిల్లా  పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా అధికారులు పనిచేయాలని అన్నారు. జాతర నిర్వహణ మొత్తంలో నోడల్ అధికారులు, మరియు సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను పూర్తి చేయాలని  అన్నారు. గత మహా జాతరలోని లోపాలు తిరిగి పునరావృతం కాకుండా, భక్తులకు మెరుగైన సకల సౌకర్యాలు కల్పించాలన్నారు.  అదనపు కలెక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ ప్రతి జోనల్ అధికారి తో గత అనుభవాల తో, జాతరలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో  పని చేయాలని అన్నారు. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఆదేశాల మేరకు జాతర కు వచ్చే భక్తులకు ఈ నెల నుంచి వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా  వైద్య అధికారి అన్నారు. జాతర సమయంలో
30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే రహదారులు మరమత్తులు కూడా త్వరలోనే పూర్తి చేయాలని అన్నారు. శానిటేషన్ పనులు విషయం లో  మండల అధికారులు, ప్రత్యేక అధికారులు  పర్యవేక్షణలో ఉండాలని  అన్నారు, జాతర కోసం ఆరు వేల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం దృష్టిలో ఉంచుకొని అదనంగా బస్సు లను సిద్దం చేశాం అని అన్నారు. గతం లో 3200 బస్ లు అందుబాటు లో ఉన్నాయని ఇప్పుడు మాత్రం 7 జిల్లాల నుంచి 6 వేల బస్ లను సిద్దం చేశాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో   అదనపు కలెక్టర్  రెవిన్యూ వేణు గోపాల్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి , డి ఎస్ పి రవీందర్,  డి పి ఓ వెంకయ్య , సంక్షేమ అధికారి ప్రేమలత ,  ఐటీడీఏ  అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వసంత రావు , విద్యుత్  శాఖ ఎస్సీ మల్సూర్, డీ ఈ పులుసం నాగేశ్వర రావు, డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, ఆర్ అండ్ బి డి రఘువీర్, ఐబీడీఈ సదయ్య, స్థానిక తహసిల్దార్ తోట రవీందర్ ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, పస్రా సీఐ శంకర్, స్థానిక ఎస్సై శ్రీధర్ రెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love