సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు వైద్య పరీక్షలు

నవతెలంగాణ -రుద్రంగి
రుద్రంగి మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు మంగళవారం ఆర్.బి.ఎస్ కే ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 95 మంది విద్యార్థులకు వైద్యాధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసినట్లు సంక్షేమ వసతి గృహాధికారి రవీంద్ర స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది అభినయ, దివ్య, విజయ, అర్చన, సంధ్య తదితరు పాల్గొన్నారు.
Spread the love