– హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెల్లడి
ముబయి : పెంపుడు జంతువులకు వైద్య బీమాను అందిస్తున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో తెలిపింది. వాటి సంరక్షణకు వైద్య పరీక్షల నుంచి శస్త్రచికిత్సలు, ఔషధాలను అందించే సమగ్ర బీమా పథకం ‘పాస్ ఎన్ క్లాస్’ను ప్రారంభించినట్లు పేర్కొంది. ఏప్రిల్ 11న జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవానికి ముందస్తుగానే ఈ పత్యేకమైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది. దేశంలో పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్ ఏటా 13 శాతం పైగా పెరుగుతోందని అంచనా వేసింది.