– ఎల్‌ఐసీకి 6.66 శాతం వాటా..
ముంబయి : జియో ఫైనాన్సీయల్ సర్వీసెస్‌లో 6.66 శాతం వాటాను స్వాధీనం చేసుకున్నామని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) వెల్లడించింది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపులో నుంచి జియో ఫైనాన్సీయల్‌ను సంలీనం చేసి.. ఆగస్ట్ 21న లిస్టింగ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి మార్కెట్ కాపిటలైజేషన్ రూ.1.60 లక్షల కోట్లుగా నమోదయ్యింది. మంగళవారం బిఎస్‌ఇలో జియో ఫైనాన్సీయల్ సర్వీసెస్ 4.99 శాతం కోల్పోయి రూ.239.20 వద్ద ముగిసింది.