ఐసిఐసిఐ బ్యాంక్‌కు రూ.9,648 కోట్ల లాభాలు

ముంబయి : ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 39.7 శాతం వృద్థితో రూ.9,648 కోట్ల నికర లాభాలు సాధించింది. బ్యాంక్‌ నికర వడ్డీపై ఆదాయం 38 శాతం పెరిగి రూ.18,227 కోట్లుగా నమోదయ్యింది. మొండి బాకీల కోసం రూ.1,292 కోట్ల కేటాయింపులు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇందుకోసం రూ.1,144 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 2.76 శాతానికి తగ్గాయి. ఇంతక్రితం త్రైమాసికంలో జిఎన్‌పిఎ 2.81 శాతంగా ఉంది. నికర నిరర్థక ఆస్తులు 0.70 శాతం నుంచి 0.48 శాతానికి తగ్గాయి. గడిచిన త్రైమాసికంలో రూ.1,169 కోట్ల జిఎన్‌పిఎలను రద్దు చేసింది. గడిచిన త్రైమాసికంలో ఐసిఐసిఐ బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లు 17.9 శాతం పెరిగి రూ.12,38,737 కోట్లకు చేరగా.. దేశీయ రుణల జారీ పోర్టుపోలియో 20.6 శాతం వృద్థితో రూ.10,25,310 కోట్లకు చేరాయి.

Spread the love