హెచ్‌డిఎఫ్‌సి లక్ష మంది ఖాతాదారులకు ఇ-రూపీ సౌలభ్యం

ముంబయి: ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌నకు చెందిన లక్ష మంది ఖాతాదారులు, 1,70,000 వ్యాపారులకు పైలట్‌ ప్రాజెక్టు కింద డిజిటల్‌ కరెన్సీ వినియోగానికి అవకాశం కల్పించింది. ”సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సిబిడిసి) అందుబాటులోకి తెచ్చిన ఇ-రూపీ లావాదేవీలకు వారికి అవకాశం కల్పించనున్నాము. క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగించి చెల్లింపులు చేయడానికి వీలుంది.” అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తెలిపింది. ఈ ఏడాదిలో 10 లక్షల ఇ-రూపీ లావాదేవీలు చేపట్టా లని ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకున్నామని.. ప్రస్తుతం ఇది 5,000 నుంచి 10,000గా ఉందని ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ టి రబి శంకర్‌ తెలిపారు. ఇది తమ వినియోగదారుల నుంచి నుండి డిజిటల్‌ రూపాయి కరెన్సీ రూపంలో లావదేవీలను అనుమతిస్తుందని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా దేశం లోని ఇతర కీలక నగరాల్లో డిజిటల్‌ రూపాయి చెల్లింపులను అందిస్తోన్నామని తెలిపింది.

Spread the love