మహబూబ్‌నగర్‌ లో వచ్చే నెల 2న మెగా జాబ్‌మేళా

నవతెలంగాణ – హైదరాబాద్
వచ్చే నెల 2 వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్‌, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. పాలమూరు కలెక్టరేట్‌లో జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టర్‌ రవినాయక్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జా బ్‌మేళాలో 105 కంపెనీల ద్వారా పది వేలకు పైగా ఉ ద్యోగాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో జాబ్‌మేళా నిర్వహించి 32 వేల మం దికి ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామకపత్రాలు కూడా అందించామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గతేడాది జాబ్‌మేళా ద్వారా 2,800 మందికి ఉద్యోగా లు కల్పించామన్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల, ఎ ల్బీనగర్‌, బాలానగర్‌ తదితర ప్రాంతాల్లోని పారిశ్రామిక కంపెనీలతో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పించామన్నారు. గత నెలలో మేళా నిర్వహించి ఐటీ కారిడార్‌లో 650 మందికి ఉద్యోగావకాశాలు ఇచ్చామన్నారు. సెప్టెంబర్‌ 2న కేవలం మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని నిరుద్యోగ అభ్యర్థుల కోసమే ఇంటర్వ్యూలు నిర్వహించి సెల క్ట్‌ అయిన వారికి ఉత్తర్వులు కూడా అందజేస్తామన్నా రు. రూ.15 వేల నుంచి రూ.1 లక్ష వరకు జీతం వచ్చే లా సాఫ్ట్‌వేర్‌, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌, ఇంజినీరింగ్‌ త దితర రంగాల్లో ఉద్యోగాలు ఉంటాయన్నారు. పదో తరగతిపైన చదివిన వారు అర్హులన్నారు. ఉమ్మడి జిల్లా అ భ్యర్థుల కోసం త్వరలోనే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించి జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. త్వ రలోనే ఐటీ టవర్‌లో మూడు నెలలకోసారి 45 కోర్సులకు ట్రైనింగ్‌ ఇస్తామన్నారు. కార్యక్రమంలో సెట్విన్‌ ఎండీ వేణుగోపాల్‌, ఏఎస్పీ రాములు, డీఎస్పీ మహేశ్‌, సెట్మా మేనేజర్‌ విజయ్‌కుమార్‌ తదితరులున్నారు.

 

Spread the love