నవతెలంగాణ – అమరావతి
ఏపీలో ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో నెల్లూరు జిల్లాలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతోంది. గత ఎన్నికలో వైసీపీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా టీడీపీ యువనేత నారా లోకేశ్ తో వైసీపీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. కడప జిల్లా బద్వేలులో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ను మేకపాటి ఈరోజు కలిశారు. లోకేశ్ పాదయాత్రకు ఆయన సంఘీభావం ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ బహిష్కృత నేతలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా టీడీపీలో చేరబోతున్నారు.