నవతెలంగాణ- రెంజల్:
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విశ్వకర్మ పథకంలో 18 కులాలకు సంబంధించిన వారు దరఖాస్తులు ఎలా చేసుకోవాలో బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. శనివారం కందకుర్తి గ్రామంలో నిర్వహించిన చేతివృత్తుల కులాల వారు ఈ పథకము ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అర్హత కలిగిన వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నియోజకవర్గ ఇంచార్జ్ క్యాతం యోగేష్, మండల అధ్యక్షులు గోపికృష్ణ, మాజీ మండల అధ్యక్షులు మేక సంతోష్, మండల కార్యదర్శి సంగం శ్రీనివాస్, పార్ధ రమేష్, చేతి వృత్తుల కులాలవారు పాల్గొన్నారు.