ప్రశాంతమైన జీవితానికి మానసిక ఆరోగ్యం అవసరం..

నవతెలంగాణ- డిచ్ పల్లి:
మనిషి ప్రశాంతమైన జీవితానికి మానసిక ఆరోగ్యం అవసరమని, నేటి సమాజంలో మనిషి తరచూ ఒత్తిడికి గురి అవుతూ డిప్రెషన్ లోకి వెళ్లడం  జరుగుతుందని, అలాంటి వ్యక్తి  ప్రశాంతంగా ఉండాలని  మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ అన్నారు. మంగళవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా పరిపూర్ణత ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతారని,  మనిషి ప్రశాంతమైన జీవితానికి మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమన్నారు. నేటి సమాజంలో మనిషి తరచూ ఒత్తిడికి గురౌతున్నారని, ఇదే కాకుండా డిప్రెషన్ కు వెళ్లడం  జరుగుతుందని,  అలాంటి వ్యక్తి  ప్రశాంతంగా ఉండాలని సూచించారు. మానసికంగా ఆరోగ్యం సరిగా లేకపోవడానికి కారణాలు ఒక వ్యక్తి తన జీవితంలో సమీప బంధువు అతి ఇష్టమైన వ్యక్తి మృతి చెందడం,  మధ్యం సేవించే అలవాటు ఉండటం, లేదా గృహహింస, తీవ్రమైన శారీరక అనారోగ్యం, ఒంటరితనం, సామాజిక హింస, లాంటివి ఉన్నట్లయితే వారు మానసిక రోగులుగా తయారవుతారని పేర్కొన్నారు. అలాంటి వారి కుటుంబ పరంగా  వారి కుటుంబంలో మానసిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నట్లయితే వారు కూడా అనుకోకుండా మానస రోగులుగా తయారవుతారని, వారితో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ప్రశాంతమైన వాతావరణంలో ఆయనతో మాట్లాడాలని, అ బాధను మనం అర్థం చేసుకోవాలని వివరించారు. అలాంటి వారికి కావాల్సిన చికిత్సను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకువచ్చి డాక్టర్ సలహా మేరకు వైద్యాన్ని ప్రారంభించాలని, క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు ఇలాంటి రోగులను గుర్తించి చికిత్స అందించవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఆరోగ్య కార్యకర్త మానసిక రోగులను ప్రత్యేకంగా వారితో మాట్లాడి వారి సమస్య తెలుసుకొని వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలని ఆదేశిస్తున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love