జి20 స్టార్టప్20 ‘శిఖర్’లో అధికారిక మొబిలిటీ భాగస్వామి ఎంజి మోటార్

నవతెలంగాణ- హైదరాబాద్: ఇప్పటి వరకు 99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజి (MG) మోటార్ ఇండియాను తన మొబిలిటీ పార్టనర్‌గా మార్చుకోవడం ద్వారా స్టార్టప్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియాతో కలిసి ‘స్టార్టప్20’ శిఖర్ కార్యక్రమానికి తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. తన ఎంజి డెవలపర్ అండ్ గ్రాంట్ ప్రోగ్రామ్ (MGDP)తో కలిసి, దేశంలోని మొబిలిటీ స్పేస్‌లో ఆవిష్కరణ, ఎంటర్‌ప్యూనర్‌షిప్‌ను పెంపొందించేందుకు ఎంజి మోటార్ ఇండియా నిబద్ధతను ఈ సహకారం ప్రతిబింబిస్తుంది. ఈ సదస్సు సమ్మిట్ 2023 జూలై 3 మరియు 4 తేదీల్లో గుర్‌గావ్‌లో నిర్వహించారు. ‘స్టార్టప్ 20’ శిఖర్ కార్యక్రమానికి స్టార్టప్ ఇండియా మరియు ఇన్వెస్ట్ ఇండియాతో భాగస్వామ్యం ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మద్దతు ఇవ్వడం, అర్ధవంతమైన సహకారానికి వేదికను అందించడంలో ఎంజి మోటార్ ఇండియా తన అంకితభావాన్ని మరింత ప్రదర్శించింది. ఈ కార్యక్రమం స్టార్టప్‌లకు గ్లోబల్ లీడర్‌లతో అనుసంధానం అయ్యేందుకు, వారి వినూత్న ఆలోచనలను పంచుకునేందుకు, భారతదేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ భవిష్యత్తును రూపొందించడంలో మద్దతు ఇచ్చేందుకు ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది. ఎంజి మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, ‘‘మా ఎంజి డెవలపర్ అండ్ గ్రాంట్ ప్రోగ్రామ్ ద్వారా భారతీయ వాహన పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు సాధికారత కల్పించడంలో మా నిబద్ధతను బలోపేతం చేయడం మాకు గర్వకారణం.
భారతదేశంలో మేము స్థిరంగా సాంకేతిక పురోగతిని సాధించడంతో పాటు, ఎంటర్‌ప్యూనర్లకు విస్తృతమైన మద్దతును అందించాము. అధికారిక మొబిలిటీ భాగస్వామిగా ‘స్టార్టప్20’ శిఖర్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, ప్రభావవంతమైన సహకారాన్ని సులభతరం చేసేందుకు మరియు ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించేందుకు మేము అవకాశం కోసం ఎదురుచూస్తున్నాము’’ అని తెలిపారు. భారతదేశంలో మేము సేవలను ప్రారంభించినప్పటి నుంచి, మొబిలిటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు కొత్త, సాంకేతికంగా అధునాతన అప్లికేషన్‌లు మరియు అనుభవాలను అభివృద్ధి చేసేందుకు టెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో ఎంజి మోటార్ ఇండియా ముందంజలో ఉంది.
ఎంజిడిపి (MGDP), ఆటోమోటివ్ విభాగంలో అతిపెద్ద మెంటరింగ్ ప్రోగ్రామ్ కాగా, గత నాలుగేళ్లుగా సుమారు 1,500 స్టార్టప్‌లతో కలిసి పని చేస్తుంది. ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ మొబిలిటీ, బ్లాక్‌చెయిన్, కనెక్టెడ్ కార్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వర్చువల్ రియాలిటీ (VR), ఈజ్ ఆఫ్ బిజినెస్, షేర్డ్ మొబిలిటీ, వెహికల్ డయాగ్నోస్టిక్స్ మరియు సస్టైనబిలిటీ వంటి వివిధ డొమైన్‌లలో 25 స్టార్టప్‌లు విజేతలుగా నిలిచాయి.  స్టార్టప్ 20 అనేది భారతదేశం జి20 ప్రెసిడెన్సీ క్రింద స్థాపించబడిన ఒక అధికారిక ఎంగేజ్‌మెంట్ గ్రూప్ కాగా, ఇది గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ వాటాదారుల కోసం ఒక డైలాగ్ ఫోరమ్‌గా పనిచేస్తుంది. ఈవెంట్ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ప్రాతినిధ్యం వహించడం మరియు జి20 నాయకులతో ఎంటర్‌ప్యూనర్లు ఎదుర్కొంటున్న స్థూల ఆర్థిక ఆందోళనలు, సవాళ్లను పరిష్కరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. జి20 సభ్యులు మరియు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలు మరియు జాతీయ ప్రతినిధులతో సహా 300 మంది ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love