రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు నల్గొండకు చేరుకుంటారు.నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 12 .30 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమావేశమౌతారు. మధ్యాహ్నం 1 గంటకు కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో 38 కోట్ల రూపాయలతో సోమన్నవాగు వద్ద నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జ్ తో పాటు పలు పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఐతవారిగూడెం ముషంపల్లి గ్రామం వద్ద 1 కోటి రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు.అనంతరం ముషంపల్లి గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 5 గంటలకు ముషంపల్లి నుంచి బయలుదేరి రాత్రి 07.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.