ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

నవతెలంగాణ – అచ్చంపేట
అమ్రాబాద్  మండలం మాచారం గ్రామంలో అనుష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, శంకర నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి పొర సస్త్రసికిత్స శిబిరాన్ని శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి కంటి శాస్త్ర చికిత్స శిబిరాన్ని, మొబైల్ వెహికల్ సర్జికల్ క్లినిక్లను ప్రారంభించారు. మంత్రి వైద్యులతో కంటి పరీక్షను చేయించుకున్నారు. వివిధ గ్రామాల పేద ప్రజలు ఉచిత కంటి శస్త్ర చికిత్స ను  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మారుమూల ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా అందించడం పట్ల అనూష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్  వారిని అభినందించారు. ప్రజలు ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. గ్రామానికి చెందిన జలంధర్ రెడ్డి తమ సొంత గ్రామమైన మాచారం గ్రామంలో గుడి , బడి తో పాటు గ్రామానికి అవసరమైన మౌలిక వసతులను సమకూర్చిన గొప్ప వ్యక్తి అభి వర్ణించారు. రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో మరెన్నో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను  చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. చాలా ఏళ్లుగా ప్రజలు ఎదురుచూసిన ప్రజా సంక్షేమ కాంగ్రెస్ పాలన వచ్చిందన్నారు. ప్రజలందరినీ  కష్టాల నుంచి విముక్తి చేయాలనేదే మా ప్రభుత్వ  లక్ష్యం అన్నారు. మహిళలకు ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో అమ్రాబాద్ జడ్పిటిసి సభ్యురాలు డాక్టర్ అనురాధ, ఎంపీపీ శ్రీనివాసులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేందర్ న్యాయవాది, తదితరులు ఉన్నారు.
Spread the love