విద్యా, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత: మంత్రి సీతక్క

– విద్యార్థులకు జ్ఞానంతో కూడిన విద్యను అందించాలి
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
నవతెలంగాణ – అచ్చంపేట
విద్య, వైద్యానికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులకు జ్ఞానంతో కూడిన విద్యను అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి అనసూయ సూచించారు. అమ్రాబాద్ మండలం తెలుగు పల్లి గ్రామంలో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయ నూతన భవనాన్ని మంత్రి దనసరి అనసూయ అసియాస్ సీతక్క, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి ఆమె  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కస్తూరిబా పేరిట అందమైన అత్యధునాతన విద్యాలయంగా నల్లమల్ల ప్రాంతంలోని తెలుగుపల్లి కేజీబీవీ నిలిచిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని అనడానికి ఈ దేశాన్ని ఏలింది ఇందిరమ్మ, ఈ దేశంలో మొదటి రాష్ట్రపతిగా కూడా మహిళ, ఇప్పుడు కూడా ఒక ఆదివాసి మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు. మరి విమానాలను గాని మిలిటరీలో గాని విద్యాలయాల్లో గాని ఎక్కడైనా కూడా ప్రతి చోట మహిళలు ముందంజలోకి వస్తున్నారు. దీనికి  కారణం ఒకప్పుటీ మధ్యనాటి యుగంలో మన సంస్కృతి ఆడవాళ్లకు స్కూలు వద్దు ఆడవాళ్ళు బయటికి రావద్దు అని దురాచారాల మీద పోరాటం చేసినటువంటి మహానీయుడి భార్యగా మహానీయుడు జ్యోతిరావు పూలే మనమందరికి తెలుసు. జ్యోతిరావు పూలే వారి సతీమణి సావిత్రిబాయి పూలే ఆమె మనకు ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ప్రారంభించిన స్కూల్ లో  విద్యా బోధిస్తే ఆడవాళ్ళకి ఎందుకు విద్యా చెప్పిన ఆడవాళ్లకు ఎందుకు స్కూల్లు పెట్టిన, ఆ రోజు ప్రయత్నం చేయకుండా ఉంటే ఈరోజు ఇక్కడ  ఆడవాళ్ళం కూర్చునే వాళ్ళం కాదన్నారు. నల్లమల్ల బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతంగా ఎదగాలి అని, కేజీబీవీ నిర్మాణానికి కృషిచేసిన ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు, కాంట్రాక్టర్ కు అభినందనలు తెలిపారు. పాఠశాల ఆవరణను అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేశారని, పాఠశాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సంస్కారంతో కూడిన విద్యను అందించాలని సూచించారు. చదువుకుంటేనే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని, ఇప్పుడు సమాజంలో ప్రైవేటు ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో అధిక కాంపిటేషన్ ఉందని అందుకు జ్ఞానవంతమైన విద్యను అవలంబించాలని కోరారు.
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. అప్పటి ప్రధాన మన్మోహన్ సింగ్ హయాంలో మహిళలు విద్యను పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా కేజీబీవీలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో 8 కేజీబీవీలలో అన్నింటికీ సొంత భవనాలు ఉన్నాయి అని చెప్పారు. పాఠశాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని, 5 కేజీబీవీలలో ఐదింటిలో ఇంటర్మీడియట్ విద్య కొనసాగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేజీబీవీలో చదివే అమ్మాయి ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమని సొంత నియోజకవర్గమని, ముఖ్యమంత్రి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నియోజకవర్గం విద్య మరియు టూరిజం హబ్బుగా మారనున్నట్లు ఆయన వెల్లడించారు. కేజీబీవీ ప్రత్యేక అధికారి శారద మాట్లాడుతూ…2017 సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు  మంచి భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు. కేజీబీవీకి మిషన్ భగీర నీటి సరఫరాను కల్పించారని, భవనం చుట్టూ కాంపౌండ్ వాల్, సిసి రోడ్డు నిర్మాణం, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు ఏకరు దుస్తులు, పాఠ్యపుస్తకాలను అందజేశారు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాప్ చైర్మన్ శివసేనారెడ్డి, జడ్పిటిసి డాక్టర్ అనురాధ, డిఇఓ గోవిందరాజులు ఇతర ఉపాధ్యాయులు అధికారులు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love