మున్సిపల్‌ పాలకవర్గం ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ- గజ్వేల్‌: గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ లోని ప్రభుత్వ మున్సిపల్‌ చైర్మన్‌ యన్‌ సి.రాజమౌళి మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి హరీష్‌ రావు జన్మదిన పురస్కరించుకొని శనివారం ఉదయం మున్సిపల్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో తల్లి బిడ్డలకు పలువురు రోగులకు పండ్లు బ్రెడ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి హాజరైయ్యారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ జగియోద్దీన్‌, కౌన్సిలర్లు రహీం, బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్‌ రెడ్డి, పంబాల అర్చన శివ కుమార్‌, హాస్పిటల్‌ సూపరిడెంట్‌ కిరణ్‌, ఐవీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌ గుప్తా డైరెక్టర్లు సయ్యద్‌ మతిన్‌, కూరాకుల సాయి, శిలసారం ప్రవీణ్‌, కుర్ర సాయి రెడ్డి, నాయకులు, కొన్నే రాజిరెడ్డి, షరీఫ్‌, బాలకుమార్‌ సుంకరి, రాచకొండ శ్రీనివాస్‌, మామిడి కృష్ణ, కొమురవెల్లి ప్రవీణ్‌, ఆరిఫ్‌, విష్ణువర్ధన్‌, వినరు రెడ్డి సాయి మహేష్‌ కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ- గజ్వేల్‌ : పేదలకు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అండగా ఉంటున్నారని గజ్వేల్‌ ఆత్మ కమిటీ డైరెక్టర్‌ కూరాకుల సాయి కుమార్‌ అన్నారు. శనివారం మంత్రి హరీష్‌ రావు జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి హరీష్‌ రావు పేదల సంక్షేమానికి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాటలో పయనిస్తూ ముందుకు సాగుతున్నారు. పేదలు చిన్న మెసేజ్‌ చేస్తే దానికి జవాబు వెంటనే స్పందిస్తారని ఆయన గుర్తు చేశారు. పేదల మనసులో మంత్రి నిండుగా ఉంటారని ఆయన అన్నారు.
నంగునూరు-నంగునూరు : సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రియతమ నాయకులు,ఆర్ధిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్‌ రావు పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. నంగునూరు మండల పరిధిలోని కోనాయిపల్లి, పాలమాకుల వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో మంత్రి హరీష్‌ రావు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.రాజగోపాల్‌ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ జాప శ్రీకాంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్వి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో మంత్రి హరీష్‌ రావు 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 51 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. గ్రామాల్లో సైతం మంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేక్‌ ను కట్‌ చేసి, స్వీట్లు, పండ్లు,మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ నాయకులు నార్లపురం రాంమోహన్‌, గోవిందారం రవి,నంగునూరు మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థి విభాగం,యువజన విభాగం ,మహిళలు, రైతుబంధు సభ్యులు, సోసైటి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-మద్దూరు : దూల్మిట్ట మండల కేంద్రంలో మంత్రి హరీష్‌ రావు జన్మదిన వేడుకలను సర్పంచ్‌ దుబ్బుడు దీపిక వేణుగోపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మంత్రి హరీష్‌ రావు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మద్దూరు బిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మేక సంతోష్‌ కుమార్‌ పిఎసిఎస్‌ చైర్మన్‌ నాగిళ్ల తిరుపతిరెడ్డి బిఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-జగదేవపూర్‌ : జగదేవపూర్‌ మండల కేంద్రంలో గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద శనివారం మంత్రి హరీష్‌ రావు జన్మదినం సందర్భంగా సర్పంచ్‌ ల ఫోరం మండలాధ్యక్షుడు రాచర్ల నరేష్‌,ఆత్మ కమిటీ ఛైర్మన్‌ గుండా రంగారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్‌, ఇటిక్యాల సర్పంచ్‌ చంద్రశేఖర్‌ గుప్తా,కో అప్షన్‌ ఎక్బల్‌, బిఅరెస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ ,మాజీ సర్పంచ్‌ కరుణాకర్‌,మండల బీఆర్‌ఎస్‌ పార్టి మండల యూత్‌ అధ్యక్షులు రాజు గౌడ్‌, కొండపోచమ్మ డైరెక్టర్‌ కనకయ్య, రవి,ఆంజనేయులు, ఉప అధ్యక్షుడు శ్రీను,మండల అధికార ప్రతినిధి పరమేశ్వర్‌, మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌ బాలరాజు, వార్డ్‌ సభ్యులు సత్యం, అలీమ్‌, మహేష్‌, గణేష్‌,బాలనర్సయ్య, వెంకటేష్‌, యువకులు బాలకిషన్‌, భాను, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్స్‌ పంపిణీ చేశారు. ఎంపీటీసీ నల్లగోండ లక్ష్మి,బీఆర్‌ఎస్‌ చేరికల కమిటీ చైర్మన్‌ బోయినిపల్లి శ్రీనివాస్‌ రావు,గ్రామ బీఆర్‌ఎస్‌ నాయకులు, గ్రామస్తులు హాజరయ్యారు.

Spread the love