మిషన్ భగీరథ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి: తరుణ్ చక్రవర్తి

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
నిర్దేశించిన సమయంలోగా మిషన్ భగీరథ త్రాగునీటి సర్వేను  పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ చక్రవర్తి అన్నారు. గురువారం మండల కేంద్రంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ త్రాగునీటి సర్వేను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన మిషన్ భగీరథ నీరు వస్తుందా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇండ్ల సంఖ్య ఎంత అని పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్ ను ప్రశ్నించగా 2288 ఇండ్లు ఉన్నాయని వివరించాడు. గ్రామంలో పలుచోట్ల మురికి కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం పట్ల పంచాయతీ కార్యదర్శి పై అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే మురికి కాలనీలో శుభ్రం చేయించాలని ఆదేశించారు.వర్షాకాలం సీజన్ ఆరంభమైందున ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ మంచిగా చేయించాలన్నారు. గ్రామంలో ఇంటి పన్నుల డిమాండ్ ఎంత అని అడుగగా రూ. 42లక్షల డిమాండ్ ఉందని కార్యదర్శి తెలిపారు. ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పన్నుల వసూళ్లను  పెంచాలన్నారు. గ్రామపంచాయతీలో సిబ్బంది కొరత ఉందని పంచాయతీ కార్యదర్శి శాంతికుమార్ డిపిఓ దృష్టికి తీసుకెళ్లగా డిప్యూటేషన్ పై జూనియర్ అసిస్టెంట్ ను కేటాయిస్తామని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి వెంట ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదానంద్, పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్, పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Spread the love