వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు 

– పట్టించుకోని వాటర్ మ్యాన్,
– పంచాయతీ సిబ్బంది
– నీటి వృధాపై గ్రామస్తులు అగ్రహం
నవతెలంగాణ _బొమ్మలరామారం 
ఒకపక్క ఎండలు రోజుకింత ముదురుతూ కొన్ని గ్రామాల్లో నీటి ఎద్దటి వెలుకుంటుంటే మరికొన్ని చోట్ల పంచాయతీ సిబ్బంది, వాటర్ మెన్ నిర్లక్ష్యంతో తాగునీరు వృధాగా పోతోంది. నీటి వృధాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బొమ్మలరామారం మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నుంచి తాగునీరు వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల తీరుపై గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ నిండిన తర్వాత మోటర్ స్విచ్ బంద్ చేస్తే నీరు వృధా కాదని, ఇతర గ్రామాలకూ నీరు అందుతుందని అన్నారు. గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు ఉండవంటున్నారు. ఇలాగే ట్యాంకులు నిండి వాటర్ వృధాగా పోతుందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా స్పందించి నీటి వృధాను అరికట్టాలని కోరారు.
Spread the love