హైదరాబాద్‌లో రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనిల్…

నవతెలంగాణ – హైదరాబాద్
నెల్లూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. ఓ అపార్ట్‌మెంట్ వద్ద సెక్యూరిటీ గార్డుపై ఆయన అనుచరులు ప్రతాపం చూపించడం కలకలం రేపింది. గచ్చిబౌలి – అపర్ణ సెరెన్ అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ వివాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంటు రోడ్డుపై పార్కింగ్ చేయవద్దని సెక్యూరిటీ సూచించారు. దీంతో అనిల్ మనుషులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీపై తమ ప్రతాపం చూపించారు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని తన మనుషులతో చితకబాదించారు. ఈ తతంగం మొత్తాన్ని అపార్ట్‌మెంట్ వాసులు వీడియో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Spread the love