ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి

నవతెలంగాణ- ఆర్మూర్  : పట్టణములోని 2 వ వార్డు పరిధిలోని రంగాచారి నగర్ చేనేత కాలనీలో శ్రీ పంచముఖి హనుమాన్ మందిర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపం వద్దకు బుధవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విచ్చేసి దుర్గా మాతకు ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్బంగా దుర్గా మాత మాలలు వేసుకున్న స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, మాజీ చైర్మన్ సంజయ్ సింగ్ బబ్లు, మాజీ వైస్ చైర్మన్ లింగా గౌడ్, ఆర్మూర్ కోర్టు అడిషనల్ పీపీ ఖాందేష్ శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు గంగా మోహన్ చక్రు, ఇట్టెడి నర్సారెడ్డి భారాస సీనియర్ నాయకులు పోల సుధాకర్, జనార్దన్ గౌడ్, సుంకరి రవి, పండిత్ ప్రేమ్, జిజి రామ్, నాయకులు ఖాందేష్ సత్యం, ఆలయ కమిటీ అద్యక్షులు ఆడెపు ప్రభాకర్, గంగ రెడ్డి, బోగ గిరీష్, బోగ గంగాధర్, సత్యనారాయణ చేనేత కాలోని అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, సభ్యులు విష్ణు, రాహుల్, సాయి, సన్నీ, బిట్టు, బన్నీ, భరత్, ప్రశాంత్  తదితరులు పాల్గొన్నారు.

Spread the love