ఎన్నికల హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.. 

– బెజ్జంకి క్రాసింగ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ
నవతెలంగాణ – బెజ్జంకి
రాజీవ్ రహదారి రోడ్డు విస్తరణలో తొలగింపునకు గురైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం పునఃప్రతిష్టాపనకు నోచుకోక కొన్నేళ్లుగా వృథాగా ఉండిపోయింది.విగ్రహన్ని తిరిగి పునః ప్రతిష్టాపకు కృషి చేస్తానని గత శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కవ్వంపల్లి గ్రామస్తులకు హామీనిచ్చారు.మంగళవారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో పునః ప్రతిష్టించిన సుభాష్ చంద్ర బోస్ విగ్రహన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండల,గ్రామ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అవిష్కరించారు.అనంతరం గ్రామస్తులతో ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడారు.గ్రామస్తులందరి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా,ఎమ్మెల్యేగా ఇచ్చిన హామీని నిలుపుకున్నాని కవ్వంపల్లి తెలిపారు.రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల సంక్షేమం,ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానని ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళల ఉండాలని ఎమ్మెల్యే కోరారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,జిల్లాధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,పులి క్రిష్ణ,యువజన మండలాధ్యక్షుడు మంకాల ప్రవీన్,మాజీ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్,చిట్టి రాజు,మిట్టపల్లి చెన్నారెడ్డి,గ్రామస్తులు హజరయ్యారు.

Spread the love