నవతెలంగాణ-వలిగొండరూరల్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముద్దసాని కిరణ్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కేర్చిపల్లి గ్రామంలోబీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలింపిచాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. మండలంలోని నాతాళ్లగూడెం, వెంకటాపురం గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలసమావేశం నిర్వహించి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి గెలుపుకోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకట్ రెడ్డి, కొమిరెల్లి సంజీవరెడ్డి, సామ రాంరెడ్డి, మోటే నర్సింహ, కొత్త నర్సింహ, మద్దెల మంజుల, ఏనుగు అంజిరెడ్డి, కీసర్ల సత్తిరెడ్డి, నల్లబోలు నర్సింహ,వీరమల్ల బాలేశ్వర్ పాల్గొన్నారు.