నవతెలంగాణ – బెజ్జంకి
గుంతలమయమైన రోడ్డుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వడ్లూర్ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి స్పందించి తన స్వంత నిధులు వెచ్చించి గుంతలమైయమైన రోడ్డును మట్టితో చదును చేయించారు. రోడ్డు పనులను మండల కాంగ్రెస్ నాయకులు పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. రోడ్డును మట్టితో చదను చేయించిన ఎమ్మెల్యే కవ్వంపల్లికి పలువురు వడ్లూర్ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు ఒగ్గు దామోదర్, పార్టీ మండల అధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి పులి సంతోష్ గౌడ్, నాయకులు శేఖర్,పులి రమేష్,రాములు,జలపతి రెడ్డి తదితరులు పరిశీలించారు.