మొలంగూర్ లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్ గ్రామంలో శనివారం మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్త నాగరాజు తండ్రి మరియు చిట్ల రామక్క ఇటీవల మరణించగా వారి కుటుంబాల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వెలిచాల రాజేందర్ రావుని గెలిపించాలని కోరారు. అనంతరం ఐకెపి సెంటర్ ను సందర్శించి రైతులతో మాట్లాడారు. తాలుపేరుతో మిల్లర్లు కొర్రీలు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్,యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇసాముద్దీన్, గ్రామ శాఖ అధ్యక్షుడు నేరేళ్ల సంతోష్ కుమార్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుంట తిరుపతిరెడ్డి, నాంపెల్లి తిరుపతి,పెంట సాంబయ్య,అన్నాడి తిరుపతిరెడ్డి,కల్లూరి సంతోష్, గాజుల మహేష్, రాయిని రమేష్,నల్ల వెంకట్ రెడ్డి,తుమ్మ వేంకటపతి,అయాన్,గూళ్ల పాపయ్య,ఆదిల్,వెంకట్రాజం, తదితరులు పాల్గొన్నారు.
Spread the love