ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం: రామకృష్ణ 

నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలో 167 వ మరియు 168వ బూతులలో 2014 ఓట్లకు 1418 ఓట్లు పోలు అవ్వగా 70 . 65% ఎమ్మెల్సీ ఓట్లలో పట్టభద్రుడు వినియోగించుకున్నారని సెక్టరల్ ఆఫీసర్ రామకృష్ణ తెలిపారు సోమవారం ఓటు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాల సంబంధించిన ఎమ్మెల్సీ ఓట్లు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓట్లకు హాజరై వారి ఓటును వేసుకున్నారని అన్నారు అందులో 167 వ బూతులు 1035 మందికి 749 మంది ఓట్లు వేయగా 168వ బూతులో 979 మందికిగాను 669 మంది ఓటును వినియోగించుకున్నట్లు తెలిపారు

ప్రశాంతంగా ఎన్నికలు 
మండల కేంద్రంలో ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఓట్లకు 144 సెక్షన్ అమల్లో ఉంచి ఓటు వేసుకునే ఓటరు దారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగానే ప్రణాళిక నిర్వహించుకొని ప్రశాంతంగా నిర్వహించేందుకు స్థానిక ఎస్సై కణుకుల క్రాంతి కిరణ్ తమ సిబ్బందితో ఎక్కడికి అక్కడ సిబ్బంది ఏర్పాటు చేసి ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు
ఎన్నికల ఆవరణని పరిశీలించిన జిల్లా ఎస్పీ 
ఎన్నికల నిర్వహణ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరిగేందుకు ఎలా ఉంది వర్ష ప్రాంతంలో ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని ఎన్నికల ప్రాంతంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఎన్నికల సరళిన పరిశీలించారు  ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయని సంబంధిత ఎస్సైని అడిగి తెలుసుకున్నారు ఎన్నికల సరళని తాను పరిశీలించారు ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది ఎలాంటి ఆలోచనయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి స్థాయిలో పోలీస్ సిబ్బంది ఉండాలని అన్నారు ఎన్నికలు జరిగే ప్రాంతంలో బయట వారు ఎవరు కూడా రావద్దని తెలిపారు వీరి వెంట తొర్రూరు సిఐ సంజీవ నెల్లికుదురు ఎస్సై కనుకుల రేవంత్ కిరణ్ వారి సిబ్బంది శంకరయ్య అశోక్ వెంకటరెడ్డి తోపాటు కొంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Spread the love