– మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ
నవతెలంగాణ-వీణవంక
మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిమ్మాపూర్ ఎంపీడీవో చింతల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు చింతల సంపత్ రెడ్డి తల్లి రాధమ్మ ఇటీవల మృతి చెందింది. కాగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఆయన వెంట ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి, సర్పంచ్ పోతుల నర్సయ్య, ఎంపీటీసీలు ఒడ్డెపల్లి లక్ష్మి భూమయ్య, ఎక్కటి సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు చెకబండి శ్రీనివాస్ రెడ్డి, కట్కూరి మధుసూదన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.