నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్సీ కవిత

– దేశ వ్యాప్తంగా బి సి లకు న్యాయం జరిపించటమే బి అర్ ఎస్ లక్ష్యం
– కాంగ్రెస్ పాలనలో బి సి లను ఎందుకు పట్టించు కాలేదు. రాహుల్ గాందీ సమాధానం చెప్పాలి
– నాయి బ్రాహ్మణులు అంటే విట్టలేశ్వరుని కే క్షవరం చేసిన చరిత్ర
– అశ్విని దేవతల వారసులు నాయి బ్రాహ్మణులు
నవతెలంగాణ- కంటేశ్వర్ :
నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిపించటమే బీఅర్ఎస్ లక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో బీసీ లను పట్టించుకోలేదని రాహుల్ గాంధీ ఇందుకు సమాధానం చెప్పాలని అన్నాయి బ్రాహ్మణులు అంటే విట్టలేశ్వరుని క్షవరం చేసిన చరిత్ర ఉందని అశ్విని దేవతల వారసులు నాయి బ్రాహ్మణులని ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు. నాయి బ్రాహ్మణులు లేకుంటే సమాజానికి ఎంతటి ఇబ్బంది ఉంటదొ సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారు. నాయి బ్రాహ్మణుల కుల వృత్తిని కాపాడేందు కు సీఎం కేసీఆర్ కృషి చేశారు అని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల సెలూన్ లకు సబ్సిడీ విద్యుత్అందిస్తున్నాం. కుల వృత్తులు ప్రోత్సహిస్తూ మరో వైపు విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.12 లక్షల కళ్యాణ లక్ష్మి లబ్ధి దారుల్లో 7 లక్షలు బిసి లబ్ధిదారులు ఉన్నారు. గతం లో పనిచేసిన ప్రభుత్వాలు బి సి లను, కులవృతుల ను నిర్లక్షం చేశాయి. కేసీఆర్ ప్రభుత్వం కుల వృత్తులు ప్రోత్సహిస్తూ .మరో వైపు విద్యాపరంగా ఎంతో ప్రోత్సాహం అందిస్తుంది.బిసి లకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ లో మొట్ట మొదట తీర్మానం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు.60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హాయం లో బిసి గణన ఎందుకు జరగలేదు రాహుల్ గాందీ సమాధానం చెప్పాలి. దేశం లో ఉన్న బిసి లకు న్యాయం జరగాలి. రెండు సార్లు ఆశీర్వదించి గెలిపించారు. మళ్లీ బీఅర్ఎస్ పార్టీని భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ తోపాటు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో పాటు నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love