నడిరోడ్డులో చిరుతపై దాడిచేసి హడలెత్తించిన కోతులు…



నవతెలంగాణ – దక్షిణాఫ్రికా
చిరుతపులి కోతుల గుంపుకు చిక్కి గాయపడి ఎలాగోలా వాటి బారి నుంచి తప్పించుకుని ప్రాణాలు రక్షించుకునేందుకు వాయువేగంతో అడవిలోకి పరుగులు తీసింది. అయినప్పటికీ వదలని కోతులు దాని వెంటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దక్షిణాఫ్రికాని ఓ మారుమూల ప్రాంతలో దాదాపు  50 బబూన్లు (కోతులు) నడిరోడ్డుపై తిష్టవేసి హల్‌చల్ చేశాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో ఓ చిరుతు అటువైపుగా దర్జాగా నడుచుకుంటూ వచ్చింది. నిజానికి చిరుతను చూసి కోతులు పారిపోవాలి. కానీ అవి మందగా ఉండడంతో ఏమాత్రం బెదరలేదు. చిరుత తమ సమీపానికి రాగానే అన్నీ కలిసి దానిపై మూకుమ్మడిగా దాడిచేశాయి. దీంతో కిందపడి విలవిల్లాడిన చిరుత తప్పించుకునేందు నానా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కోతులన్నీ దానిపై పడి విచక్షణ రహితంగా దాడిచేస్తూ గాయపరిచాయి. వాటికి చేతికి చిక్కి బలహీనురాలైన చిరుత హడలిపోయింది. ప్రాణభయంతో భీతిల్లింది. వీటి ఫైట్‌తో అటుఇటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు దీనిని షూట్ చేస్తూ ఎంజాయ్ చేశారు. చివరికి వాటి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న చిరుత వాయువేగంతో రోడ్డుదాటి అడవిలోకి పరుగులు తీసింది. అయినప్పటికీ వదలని కోతులు దాని వెనకపడ్డాయి.

Spread the love