మోర్తాడ్ ఎంపిటిసి శాస్త్రి ఘర్ వాపసి..

– గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి
– మంత్రి సమక్షంలో పలువురు  బీఆర్ఎస్ లో చేరిక
 నవ తెలంగాణ -కమ్మర్ పల్లి: ఘర్ వాపసిలో భాగంగా మోర్తాడ్ మండల కేంద్రం   ఎంపిటిసి గరిసే శాస్త్రి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆయన ఘర్ వాపసి అయ్యారు. సీఎం కెసిఆర్ పాలన లోనే సబ్బండ వర్ణాలు సంతోషంగా ఉంటాయని అయన భావించి తిరిగి సొంత గూటికి చేరారు. మంగళవారం వేల్పూర్ లోని తన స్వగృహంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎంపిటిసి గరిసే శాస్త్రి కి  టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ లో పలువురి చేరికలు 
 ముఖ్యమంత్రి కేసీఆర్  జనరంజక పాలన, అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలువురు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బడాభీంగల్ నుండి ఛాలెంజ్ యూత్ సభ్యులు, రజక రాయల్స్ యూత్ సభ్యులు, కమ్మర్ పల్లి మండలం హసకొత్తూర్ గ్రామ నాయకపోడు సంఘానికి చెందిన 20 కుటుంబాలు, యువకులు, వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామం నుండి సుంకేట చిన్న మల్లారెడ్డి ఆధ్వర్యంలో యువకులు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మంగళ వారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకుల, తదితరులు పాల్గొన్నారు.
Spread the love