గత కొన్ని ఏళ్ల నుండి దేశంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ ఉచితంగా రేషన్ బియ్యం అందజేస్తున్నమని వచ్చే ఐదేళ్ల వరకు అందజేస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.శనివారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో బాగంగా అయన పాల్గొని మాట్లాడుతూ గతంలో నామ్ కే వస్తేగా అందరూ బాదరగా నూతన మండలాలను ఏర్పాటు చేసిందని, అదికారులు లేక పోవడంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చెందడం లేదని, ఎన్ని పథకాలు ఉన్నాయో అదికారులకు తెలియడం లేదని, దీంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయని,ఇది చాలా రాష్ట్రాల్లో ఉందన్నారు.ఉజ్వల పథకం లో ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందవచ్చని, ఇదే కాకుండా 700రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుందన్నారు.ఇళ్ళు లేని వారికి ఇళ్ళ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం 2లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 3లక్షలు అందజేస్తుందన్నారు.గ్యాస్ లేని వారు ముందుగా దరఖాస్తులను అందజేయాలని సూచించారు. గతంలో ఇళ్ళ నిర్మాణం కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అ డబ్బులు వాడుకోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయయని తెలిపారు.అయుష్మన్ భారత్ లో జిల్లాలో ఉన్న పలు ఆసుపత్రులలో 5లక్షల వరకు చికిత్స చేయించుకోవచ్చని, తిర్మన్ పల్లి గ్రామానికి పోస్టాఫీసు, నూతన బ్యాంకు ఏర్పాటు కు నేడే కేంద్ర మంత్రి కి ఉత్తరం రాస్తానని అన్నారు.అదికారులపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.అంతకు ముందు పాఠశాల కు చెందిన విద్యార్థినులు నృత్య ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో డిచ్ పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, తిర్మన్ పల్లి ఎంపిటిసి చింతల దాస్, ఎంపిడిఓ రాములు నాయక్, డిఎల్పిఓ నాగరాజ్, బిజెపి సీనియర్ నాయకులు కులచారి దినేష్ కూమార్, మండల అధ్యక్షులు నాయిడి రాజన్న, వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ కుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్,ఎపిఓ పోశేట్టి, ఎపిఎం సువర్ణ , గ్రామ ప్రత్యేక అధికారి డిప్ చంద్, కార్యదర్శి శ్రీ దర్, కరోబార్ నరేందర్, గన్నరం సర్పంచ్ కుంట మోహన్ రెడ్డి,శిలం రాజన్న, మహేందర్, మహేష్,తో పాటు తదితరులు పాల్గొన్నారు.