నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్, రాజరాజేశ్వరి నగర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు. ఇటీవల కమ్మర్ పల్లి మండల నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మొదటిసారిగా ఉప్లూర్, రాజరాజేశ్వరి నగర్ గ్రామపంచాయతీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో నర్సరీలను, స్మశాన వాటిక లను పరిశీలించారు. వేసవి ఎండలు ముదిరినందున మొక్కలకు ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా నీటిని అందించాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. నర్సరీలో ఎన్ని మొక్కలను సిద్ధం చేస్తున్నారు, ఏ ఏ రకాల మొక్కలను పెంచుతున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎండల నుండి మొక్కలను కాపాడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏవైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను కొత్త మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు.నర్సరీల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.స్మశాన వాటికలను సందర్శించిన ఆయన స్మశాన వాటికల పరిసరాలల్లో పిచ్చి మొక్కలను, చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, పంచాయతీ కార్యదర్శులు నరేందర్, శ్రీకాంత్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ అశ్వపతి, తదితరులు పాల్గొన్నారు.