Friday, August 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని జుక్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్ సావిత్రిబాయి సాయా గౌడ్, హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మూడు విడుతలుగా బ్యాంకు ఖాతాలో నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామంలో మరికొన్ని నూతన ఇండ్ల నిర్మాణాలకు మార్కౌట్ వేశామనీ, నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మిస్తేనే బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు గ్రామ సర్పంచ్, ఈసీ స్వామి దాస్, హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -