- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజయోగినీ బ్రహ్మకుమారి స్వప్న, బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, చిన్నారులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరికీ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
- Advertisement -



