Friday, August 28, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వడ్తల్ లో రైస్ మిల్ ను తనిఖీ చేసిన అధికారులు       

వడ్తల్ లో రైస్ మిల్ ను తనిఖీ చేసిన అధికారులు       

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
మండల పరిధిలోని వడ్తాల్ గ్రామంలోని ఓ రైస్ మిల్లును శుక్రవారం ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రైస్ మిల్ లోని ధాన్యం నిల్వలను, సీఎంఆర్ లెక్కలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ధాన్యం, సిఎంఆర్ లెక్కల్లో తేడాలున్నట్లు సంబదిత అధికారులు ముందుగా గుర్తించినట్లు తెలుస్తోంది. రైస్ మిల్ లోనే అధికారులు పంచానామ నిర్వహించి సాక్షుల సంతకాలు తీసుకున్నారు. అయితే తనిఖీల సమయంలో రైస్ మిల్ నడిపిస్తున్న యాజమాని అందుబాటులో లేనట్లు సమాచారం. దింతో అక్కడ ఉన్న గుమస్తా నుండి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఎన్ ఫోర్స్ మెంట్ డిటి రాథోడ్ రామును నవతెలంగాణ ఫోన్ లో సంప్రదించగా రైస్ మిల్లును తనిఖీ చేసిన మాట వాస్తవమన్నారు‌. తనిఖీల్లో వెల్లడైన వివరాల నివేదికను జిల్లా సివిల్ సప్లై అధికారికి అందజేస్తామని చెప్పారు. తనిఖిల్లో ఏమైనా బయటపడ్డాయా అన్న విషయం ప్రశ్నించగా, పూర్తి వివరాల కోసం డిఎస్ఓను అడగాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -