ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో శ్రీనివాస్

– వీణవంక ప్రత్యేకాధికారుల నియామకం
నవతెలంగాణ – వీణవంక
రాష్ర్ట ప్రభుత్వం సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించింది. కాగా వీణవంక మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు గాను 13 మంది గెజిటెడ్, ఇద్దరు నాన్ గెజిటెడ్ అధికారులను ప్రత్యేకాధికారులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వీణవంక ప్రత్యేకాధికారిగా ఎంపీడీవో కే శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కు మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి బాధ్యతలు అప్పగించారు. కాగా ఎంపీడీవోను వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్, ఎంపీవో ప్రభాకర్, పాలకవర్గం మాజీ సభ్యులు అభినందించారు. కాగా తహసీల్దార్ తిరుమల్ రావు (బేతిగల్, బొంతుపల్లి), ఎంపీడీవో శ్రీనివాస్ (వీణవంక, రామకృష్ణాపూర్, రెడ్డిపల్లి), డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ (చల్లూరు, గంగారం, కొండపాక), ఎంపీవో ప్రభాకర్ (మామిడాలపల్లి, పోతిరెడ్డిపల్లి, నర్సింసహులపల్లి), ఏవో గణేష్(బ్రాహ్మణపల్లి, ఘన్ముక్ల), వెటర్నరీ సర్జన్ మానస(ఇప్పలపల్లి), పీఆర్డీఈఈ ప్రకాష్ రావు(కనపర్తి), ఐసీడీఎస్ సూపర్ వైజర్ శశికిరణ్మయి (కిష్టంపేట), ఐసీడీఎస్ సూపర్ వైజర్ శ్యామలాదేవి (కోర్కల్), అసిస్టెంట్ రిజిస్టార్ కరణ్ కుమార్ (శ్రీరాములపేట), ఇరిగేషన్ ఏఈ స్వామిదాస్ (నర్సింగాపూర్), పీఆర్ఏఈ రాంబాబు (వల్బాపూర్, లస్మక్కపల్లి), ఎంబీ గ్రిడ్ డీఈఈ ప్రభాకర్ స్వామి (మల్లన్నపల్లి, మల్లారెడ్డిపల్లి), ఎంబీ గ్రిడ్ డీఈఈ త్రినాథ్ (హిమ్మత్ నగర్)లను ఆయా గ్రామాలకు ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పలువురు ఆయా గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించారు.

Spread the love