నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 1,931 ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్) పోస్టుల భర్తీ కోసం నవంబర్ 10న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య సేవల నియామక మండలి శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,666 పోస్టులుండగా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 265 పోస్టులున్నాయి.