ఆదరించిన ప్రజలందరికి రుణపడి ఉంటాం: ఎంపీటీసీలు

– వీడ్కోలు సమావేశంలో జెడ్పీటీసీ,ఎంపీటీసీ 
– ఘన వీడ్కోలు పలికిన దాచారం గ్రామస్తులు 
నవతెలంగాణ – బెజ్జంకి 
అమూల్యమైన ఓట్లేసీ ఎన్నుకుని ప్రజా సేవ చేసే అవకాశం కల్పించి అదరించిన బెజ్జంకి మండల ప్రజలకు జెడ్పీటీసీ కనగండ్ల కవిత,ముత్తన్నపేట పరిధిలోని దాచారం, ముత్తన్నపేట, నర్సింహుల పల్లి, బెజ్జంకి క్రాసింగ్ గ్రామాల ప్రజలకు ఎంపీటీసీ కొలిపాక రాజు రుణపడి ఉంటామన్నారు. మంగళవారం మండల పరిధిలోని దాచారం గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద జెడ్పీటీసీ కనగండ్ల కవిత,ఎంపీటీసీ కొలిపాక రాజును గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్,ఆరోగ్య శాఖ ఏఎన్ఎం వినోద, ఆశా వర్కర్లు సంధ్య, రేణుక, అంగన్వాడీ టీచర్లు స్వరూప, పుష్ప, పద్మ, ఆయాలు రాజవ్వ, పులవ్వ, మహిళా సంఘం వీవోలు స్రవంతి,సరోజన,మహిళా సంఘం అధ్యక్షురాలు మాతంగి రేణుక,గ్రామ పంచాయతీ కారోబార్ రాజు,సిబ్బంది కనకవ్వ, అంజయ్య,బిక్షపతి,మల్లేశం శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
Spread the love