12వ తేది వరకే ఎంసెట్‌ ఆప్షన్లు

– ఒకే విద్యార్థి 1,048 కాలేజీలకు దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ స్టేట్‌ ఎంసెట్‌-2023 అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. అందులో భాగంగానే వెబ్‌ ఆప్షన్లకు ఈనెల 12చివరి తేది అని సాంకేతిక విద్యా కమిషనర్‌, ఎంసెట్‌ కన్వీనర్‌ వాకాటి కరుణ తెలిపారు. 81,856 మంది విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నారని, 66,215 మంది విద్యార్థులు ఆప్షన్లు పెట్టుకున్నారని వెల్లడించారు. విద్యార్థులు మొత్తం 40,44,827 ఆప్షన్లు పెట్టుకున్నారని, ఒక విద్యార్థి 1,048 ఆప్షన్లు పెట్టుకున్నారని వివరించారు.

Spread the love