నవతెలంగాణ -హైదరాబాద్
ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ ఎంటీఆర్ తమ కొత్త మినిట్ ఫ్రెష్ బ్యాటర్ శ్రేణిని విడుదల చేసింది. బుధవారం హైదరాబాద ్‌లో వీటిని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈఓ సునరు బాసిన్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా దోసె, రైస్ రవ్వ ఇడ్లీ పిండి ప్యాకెట్లను రూ.60 నుంచి రూ.150 మధ్య వివిధ పరి మాణాల్లో అందుబాటులోకి తెచ్చా మన్నారు. తొలుత వీటిని క్విక్ -కామర్స్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ల ద్వారా అందుబాటులో ఉంటా యన్నారు. వినియోగదారుల అభి రుచులకు అనుగుణంగా ప్రామాణి కమైన రుచి, నాణ్యతను తక్కువ సమయంలో అందించడమే తమ లక్ష్యమన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మసాల ఉత్పత్తుల్లో 15 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నా మన్నారు.గుంటూరులోని11,200 టన్నుల సామర్థ్యమున్న ప్లాంట్‌తో పాటు తెలంగాణలోనూ తమ తయారీ యూనిట్ ఉందన్నారు.
ఎంటీఆర్ ‘మినిట్ ఫ్రెష్’ బ్యాటర్ శ్రేణి విడుదల
- Advertisement -
- Advertisement -



