పెద్ద చెరువులో చేపపిల్లలు వదిలిన ముదిరాజ్ ప్రతినిధులు

నవతెలంగాణ-గాంధారి :గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పెద్ద చెరువులో ఈరోజు గాంధారి మండల ముదిరాజ్ అధ్యక్షులు రెడ్డి రాజు  ఆధ్వర్యంలో చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బాలయ్య , గ్రామ ఉపాధ్యక్షుడు వేల్పుల నర్సింలు పోషబోయినకసిరాం, వేల్పులనారాయణ, శరభయ్య, గణేష్, రాములు, కిషన్,  తిమ్మాపూర్ రవి, సాయిలు, తిప్పారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love