– కొప్పు రాజేందర్
నవ తెలంగాణ- జక్రాన్ పల్లి : హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగనున్న సభను విజయవంతం చేయాలని ముదిరాజ్ రాష్ట్ర నాయకులు కొప్పు రాజేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 15% ఉన్న ముదిరాజులకు అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పార్టీ 20 ఎమ్మెల్యే సీట్లు మూడు పార్లమెంట్ సీట్లు కేటాయించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009లో ఇచ్చిన జీవో నెంబర్ 15 సీరియల్ నంబర్ 1 యధావిధిగా సాగించాలని బిసి ఏ గ్రూపును అమలు చేయాలని జీవో నంబర్ 6 ద్వారా మత్స్య శాఖలో ముదిరాజులందరికీ కొత్త సభ్యత్వాలు కొత్త సొసైటీలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు మాల్టి నేషనల్ కంపెనీలతో సోలార్ ప్లాంట్స్ కేజీ కల్చర్రాలు పెట్టి మత్స్యకారులకు ఉపాధి లేకుండా చేసిన ఒప్పందాలను రద్దు చేయాలని. నిటి విస్తరణతో సంబంధం లేకుండా ముదిరాజులకు18 సంవత్సరాలు దాటిన యువతి యువకులు అందరికీ మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వాలు కల్పించాలని. తెలంగాణలోని ప్రతి మండలంలో ముదిరాజులకు పండ్ల తోటల పెంపకం కోసము అవసరమైన భూమిని ప్రభుత్వం కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజులకు బిసి బందు అమలు చేయాలని, 10,000 కోట్లతో ముదిరాజులకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ తో హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్లో తలపెట్టిన ముదిరాజుల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.