మురుగుమయంగా ‘మై హౌమ్స్‌ కాలనీ’

– గత ప్రభుత్వంలో పలుమార్లు అర్జీ పెట్టుకున్నా పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు
– నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత కౌన్సిలర్‌
– అధ్వానంగా డ్రయినేజీ పైప్‌లైన్‌
– ఆరేండ్లుగా సమస్య పరిష్కరించాలని అర్జీలు
– పట్టించుకోని అధికారులు
– నామ మాత్రపు చర్యలు చేపడుతున్న అధికారులు
నవతెలంగాణ-ఆదిభట్ల
ఆదిభట్ల మున్సిపల్‌ పరిధిలోని 11వ వార్డులో ని మై హౌమ్స్‌ కాలనీ ఆరేండ్లుగా మురికి నీటికి నిలయమైపోయింది.సుమారు 500 నుండి 1000 మంది నివసిస్తున్న కాలనీ సుమారు 100 ఇండ్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో పలుమార్లు అర్జీ పె ట్టుకున్న పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు సం బంధిత వార్డు కౌన్సిలర్‌ చూసీచూడనట్టు వ్యవహ రిస్తున్నారు. వేసవి కాలంలోనే ఇలా ఉంటే వర్షా కాలంలో తమ పరిస్థితి ఏంటి అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రయినేజీ నీరు ఒక చెరువు కుంటలా మారిపోయింది. దీంతో దోమల బెడద కూడా ఎక్కువైందని స్థానికులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఎండా కాలమే తమ పరిస్థితి ఇ ట్లా ఉంటే వచ్చే వర్షాకాలానికి డ్రయినేజీ సమస్య తో కాలనీ మొత్తం ఇబ్బందుల్లో పడుతుదని కాలనీ వాసులు తెలిపారు. అసలే సీజనల్‌ వ్యాధులతో సతమతమవుతన్నారని దీనికి తోడు వానకాలం అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వారు వాపోయారు. తమ కాలనీ సమస్యను మున్సిపాలి టీ ఆఫీసర్లకు అలాగే గతంలో ఉన్న ఎమ్మెల్యే దృష్టి కి తీసుకెళ్లారని వారు తెలిపారు. అయినా ఫలితం లేదని వారు తెలిపారు. ఈ కొత్త ప్రభుత్వంలోనైనా తమ కాలనీ సమస్య తీరుతుందని మై హౌమ్‌ కాలనీ వాసులు ఆశగా ఎదిరిచూస్తున్నారు.
స్పందించని పై అధికారులు
కాలనీకి కనీ సం స్కూల్‌ బ స్సులు కూడా వచ్చే పరిస్థితి లేద న్నారు. ప్రతి రోజు తల్లి దండ్రులు మెయిన్‌ రోడ్డు వరకు పిల్లలను తెసు కెళ్ళి ఎక్కి యాల్సిన పరి స్థితి ఉంది. ఎమ్మె ల్యే దృష్టికి కమిషనర్‌ దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా మా సమస్యను పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాలు మారినా కాలనీ సమస్య తీరడం లేదు
– శ్రీనివాస్‌, కాలనీ ప్రెసిడెంట్‌

Spread the love