బౌద్ధ సంప్రదాయంతో నామకరణం

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన మేకల శ్రీకాంత్ తన కూతురుకి బౌద్ధ సంప్రదాయ ప్రకారం సోమవారం నామకరణం చేయించారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బహుజన ప్రజలు బౌద్ద పద్ధతిలో అంత్యక్రియలు, పెండ్లిలు జరుపుకుంటున్నట్లు గానే తమ పిల్లల నామకరణాలు కూడా బౌద్ద సంప్రదాయం ప్రకారం జరుపుకోవడం ఆదర్శంగా నిలుస్తోన్నాయి. ఇటీవల బీహార్ బుద్ధగాయా నుంచి విచ్చేసిన బంతే సత్యబోధి, బంతే రత్న జిల్లా పర్యటనలో ఉండగా వారి చేతుల మీదుగా బౌద్ధ సంప్రదాయంతో నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఈ జంట వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఓ మంచి సాంప్రదాయానికి నాంది పలికినట్లయ్యింది . తాను ఇలా చేస్తునందుకు గర్విస్తున్నానని అంబేడ్కరైట్ కార్యకర్త శ్రీకాంత్ అన్నారు. భగవాన్ గౌతమ బుద్ధుడు బోధించిన ప్రజ్ఞ, శీల, కరుణ అనే ఈ మూడు విలువల్లో ఒకటైన “ప్రజ్ఞ”  పేరును తన కూతురికి నామకరణం చేసినట్లు శ్రీకాంత్ తెలిపారు. అంబేడ్కర్  అనుచరులు, వారసులు అని చెప్పుకునే వారు ఇలాగే ఆయన ఆశయాలను ఆచారణలను పాటించాలని ఈ సందర్భంగా శ్రీకాంత్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Spread the love