నవతెలంగాణ-హైదరాబాద్: పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో రోజున హైదరాబాద్‌లోని ప్రముఖ సంధ్య థియేటర్ కు నటుడు అల్లు అర్జున్ రాకతో అభిమానులు, ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా అల్లు అర్జున్‌తో పాటు మిగిలిన నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ దురదృష్టకర తొక్కిసలాట ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దాఖలైన ఛార్జ్‌షీట్‌లో పోలీసులు అల్లు అర్జున్‌ను A11గా చేర్చారు.
అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



