రాహుల్ గాంధీతోనే దేశం అభివృద్ధి

– మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్

– మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ తోనే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ కేంద్రమంత్రి ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెల యాదవ రెడ్డి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి కాస్మ లక్ష్మారెడ్డి తో కలిసి శనివారం మేష రాజు పల్లి  గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా  ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారి బాధలు అడిగి తెలుసుకుని మాట్లాడారు. ఆ గ్రామస్తులు మా గ్రామానికి చెరులోనికి నీరు రావడానికి ఎస్ఆర్ఎస్పీ కాల్వ ద్వారా మా గ్రామ చెరువు నింపాలని మరియు మా గ్రామానికి బస్సు సౌకర్ కల్పించాలని అక్కడ ప్రజలు కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ స్పందించి ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆ గ్రామ సెంటర్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హాయంలోనే దేశం అభివృద్ధి అన్ని రంగాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలవబోతున్నారని, దీంతో రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాబోతున్నారని అన్నారు .కావున మన ప్రాంత నాయకుడు ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయకుని గెలిపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తుందని అన్నారు.
త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దపేట చేసిందని అన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డును ప్రతి గడప గడపకు చేరవేసి వారి అడ్రస్సును రాసి బలరాం నాయక్ అందించాలని, అది సిస్టంలో అప్లోడ్ చేయబడుతుంది అని అన్నారు. చదువుకున్న యువతకు రూ ఒక లక్ష త్వరలోనే పోతున్నామని అన్నారు. రైతులకు న్యాయం జరిగేందుకు రుణమాఫీ చేసి రైతు న్యాయం చేస్తామని అన్నారు. జనగణన చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా సామాజిక న్యాయం చేస్తామని అన్నారు. ఒక లక్ష ప్రతి సంవత్సరానికి అందించేందుకు ప్రతి కుటుంబంలో ఒక మహిళకు నారీ న్యాయం చేయబోతున్నామని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు రూ.400 రూపాయలను కట్టించేందుకు శ్రామిక న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. కావున ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  బలరాం నాయక్ గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు. గతంలో కేంద్ర మత్రిగా పనిచేశారని ఇప్పుడు గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని బలరాం నాయక్ మళ్ళీ కేంద్రమంత్రి వస్తుందని వస్తుందని దీంతో ఈ ప్రాంతం మహబూబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు అన్నీ అన్ని రంగాలుగా అభివృద్ధి దశలో ముందుకు సాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, కుమ్మరికుంట్లా మౌనేందర్, ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు వెలిశాల దేవేందర్ రావు, కూరపాటి వెంకటేశ్వర్లు, డేగల వెంకన్న, దేశ గాని బలరాం, జిలాని, ఎర్రబెల్లి మురళీధర్ రావు ,వెల్తురు ఐలయ్య, టైలర్ వెంకన్న, పట్నం శెట్టి నాగరాజు, జిలకర యాదద్రి ,బాలాజీ నాయక్, సలగు పూర్ణచందర్, వరిపల్లి పూర్ణచందర్ తో పటు వివిధ గ్రామాల మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Spread the love