Saturday, June 27, 2026
E-PAPER
Homeజాతీయం'ప్రధాన్ గో బ్యాక్' పేరుతోదేశవ్యాప్త ఆందోళన

‘ప్రధాన్ గో బ్యాక్’ పేరుతోదేశవ్యాప్త ఆందోళన

- Advertisement -

అమాయకుల రక్తం ఆయన చేతులపై ఉంది
ప్రధాని మోడీ కూడా బాధ్యుడే : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
ఏడో రోజు కొనసాగిన ‘కాక్రోచ్‌’ నిరసన

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అమాయకుల రక్తం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతులపై ఉందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. కేంద్ర మంత్రే అసలైన తీవ్రవాదని, ప్రధాన్‌ను తొలగించని ప్రధానమంత్రి కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులేనని అభిజీత్ అన్నారు. మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ ‘ప్రధాన్ గో బ్యాక్’ పేరుతో దేశవ్యాప్త నిరసనను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించడానికి నిరాకరిస్తున్నారని విమర్శించారు. తమ గళాన్ని బలోపేతం చేయడానికి, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి, సోనమ్ వాంగ్‌చుక్ 28 నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నారని తెలిపారు. విద్యార్థులు ఏడు రోజులుగా జవాబుదారీతనం కోసం డిమాండ్ చేస్తున్నా, విద్యాశాఖ మంత్రి.. తన పదవి నుంచి వైదొలగడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ మౌనం సిగ్గుచేటని, తాము వెనకడుగు వేయబోమని అభిజీత్‌ ‌దీప్కే స్పష్టం చేశారు.

దేశంలోని నలుమూలల నుంచి ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడు, రైతు, తల్లిదండ్రులు ఆందోళనలో చేరాలని పిలుపునిచ్చారు. ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన శుక్రవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. రైతు నేత గుర్నామ్ సింగ్ ఆందోళన వద్దకు చేరుకుని మద్దతు తెలిపారు. అలాగే మరోవైపు 14 మందితో ఆందోళన సమన్వయ కమిటీ ప్రకటించారు. జూన్ 28న జరగబోయే నిరసన కార్యక్రమానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని సమన్వయ కమిటీ సభ్యులు చెప్పారు. ఆదివారం నాడు పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి నిరసన తెలుపుతామని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, రైతులతో సహా యావత్ ప్రజలు జంతర్ మంతర్‌కు చేరుకోవాలని తెలిపారు. రైతు, విద్యార్థి సంఘాల బలమైన మద్దతుతో తాము ఐక్యంగా ఉన్నామని అన్నారు. సీజేపీ ఆందోళనలో భాగంగా ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా ఆదివారమే నిరాహార దీక్షను ప్రారంభించనున్నారు.

సీజేపీ ఆందోళనకు మహిళా సంఘాలు మద్దతు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలమైనందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న విద్యార్థి, యువజన ఉద్యమానికి మహిళా సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఐద్వా ప్రధాన కార్యదర్శి కనినిక ఘోష్, ఉపాధ్యక్షులు మరియం ధావలే, జగమతి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా, ఏఐపీడబ్ల్యూఏ జాతీయ కార్యదర్శి శ్వేత రాజ్, ఇతర సీనియర్ నాయకులు సీజేపీకి చెందిన అభిజీత్ దీప్కే, విజేత దహియాలతో పాటు ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల నాయకులను కలిశారు. మహిళా సంఘాల ఉమ్మడి ప్రతినిధి బృందం ఈ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. అలాగే విద్యార్థులు, యువత సందేశాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -